మహేష్ ఫ్యాన్స్‌కి మసాలా ట్రీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో మహేష్ అన్ని రికార్డులను పాతరపెడతాడని అనుకున్నారు. అయితే ఈ సినిమా కూడా మహేష్ గత సినిమాల్లాగా కేవలం బాక్సాఫీస్ హిట్ మూవీగా మాత్రమే మిగిలింది. శ్రీమంతుడుతో మొదలైన మహేష్ సక్సెస్ జర్నీ, భరత్ అనే నేను, మహర్షిలతో కంటిన్యూ అవుతూ వచ్చింది.

అయితే ఈ మధ్య కాలంలో మహేష్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒక అంశం మిస్ అవుతున్నారు. అది ఏమిటంటే.. మహేష్ దగ్గర్నుంచి మాస్ మసాలా అంశాలు ఏమీ లేకపోవడం. పోకిరి, దూకుడు వంటి సినిమాల్లో మహేష్ ఇచ్చిన మాస్ మసాలా అంతా ఇంతా కాదు. ఇప్పుడు కేవలం మెసేజ్ ఓరియెంటెడ్ మూవీలతో మహేష్ ఓ విధంగా విసుగు తెప్పిస్తున్నాడని చెప్పాలి. అయితే ఇప్పుడు మహేష్ తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ఈ సినిమా కూడా కేవలం సాఫ్ట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందేమో అని మహేష్ ఫ్యాన్స్ భయపడ్డారు.

కానీ చిత్ర యూనిట్ ప్రకారం ఈ సినిమా కోసం దర్శకుడు అదిరిపోయే మాస్ అంశాలను రాసుకున్నాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటూనే, యాక్షన్ ఎపిసోడ్స్‌కు కొదువే ఉండదని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక అదిరిపోయే పాత్రలో కనిపించి ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు.

Leave a comment