మహర్షి వరల్డ్‌వైడ్ ప్రీ-రిలీజ్ బిజినెస్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్ వర్గా్ల్లో అదిరిపోయే హైప్ క్రియేట్ చేసింది. మహేష్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అయ్యింది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్లు చెదిరే విధంగా జరగడంతో సినిమా కలెక్షన్లపై అప్పుడే అంచనాలు వేస్తున్నాడు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్.

మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజిలో ఉంటాయా అని అంటున్నారు మార్కెట్ వర్గాలు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. అల్లరి నరేష్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్ర ప్రపంచవ్యాప్త ప్రీ-రిలీజ్ బిజినెస్‌ వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ప్రీరిలీజ్ బిజినెస్
నైజాం – 24.0 కోట్లు
సీడెడ్ – 12.6 కోట్లు
వైజాగ్ – 9.6 కోట్లు
ఈస్ట్ – 7.2 కోట్లు
వెస్ట్ – 6.0 కోట్లు
కృష్ణా – 6.0 కోట్లు
గుంటూరు – 7.7 కోట్లు
నెల్లూరు – 2.9 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 76 కోట్లు
కర్ణాటక – 8.3 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.7 కోట్లు
ఓవర్సీస్ – 14.0 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 100 కోట్లు
శాటిలైట్ – 16.5 కోట్లు
డిజిటల్ – 11.0 కోట్లు
హిందీ డబ్బింగ్ రైట్స్ – 20.0 కోట్లు
ఇతర విలువలు – 2.5 కోట్లు
గ్రాండ్ టోటల్ – 150 కోట్లు

Leave a comment