హిప్పీ మూవీ ఆఫీషియల్ ట్రైలర్..!

ఈ మద్య ఒక్క సినిమాతో స్టార్ రేంజ్ కి ఎదిగిపోతున్నారు కొంత మంది హీరోలు, హీరోయిన్లు. ఆ మద్య పెళ్లిచూపులు తర్వాత అర్జున్ రెడ్డితో స్టార్ రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. సీనియర్ హీరోలకు వచ్చినంత ప్రాధాన్యత ఈ హీరోకి వచ్చింది. ఇక వర్మ శిశ్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘ఆర్ఎక్స్ 100’సినిమాలో హీరోగా నటించిన కార్తికేయ వరుస ఛాన్సులు అందుకుంటున్నారు.

ఆర్ ఎక్స్ 100 మూవీపై మొదట విమర్శలు వచ్చాయి..ఈ సినిమా పచ్చి బూతు సినిమాగా ఉందని అన్నారు..కానీ తర్వాత కంటెంట్ బాగుందని..యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో భారీగా కలెక్షన్లు కూడా రాబట్టింది.

టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ‘హిప్పీ’సినిమాలో హీరోగా నటిస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే.. ప్యారడైజ్ బిగిన్స్.. అదే అమ్మాయి మనల్ని తిరిగి లవ్ చేయడం స్టార్ట్ చేస్తే.. మై ప్యారడైజ్ లాస్ట్” అంటూ కార్తికేయ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.

ఈ సినిమాలో ప్లే బాయ్ గా కనిపిస్తున్నాడు కార్తికేయ. ఇద్దరు లవర్స్ మద్య నలిగిపోయే బాయ్ ఫ్రెండ్ లా కనిపిస్తున్నాడు. ఇక ‘అమ్మాయిలను చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా..? వాళ్లు ఒక్కొక్క దినం ఒక్కో మాదిరి ఉంటారు’ అని జెడి చక్రవర్తి చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ‘హిప్పీ’మూవి హిట్ అయితే..మరో స్టార్ టాలీవుడ్ కి దొరికినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Leave a comment