పవర్ స్టార్ తో సినిమాపై హరీష్ క్లారిటీ

Harish shankar clarifies about movie with power star

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ కి మంచి ఊపు ఇచ్చి మరింత క్రేజ్ పెంచిన గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరో సారి పవన్ ని డైరెక్ట్ చేయబోతున్నట్టు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతోంది. మళ్ళీ ఈ హిట్ కాంబినేషన్ ఖాయం అని ప్రచారం జరుగుతోంది. గబ్బర్ సింగ్ విషయంతో హరీష్ మెగా అభిమానులకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు ముగిసిపోవడంతో పవన్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నాడని ఇక వరుస వరుసగా సినిమాలు చేస్తాడని పవన్ ఫ్యాన్స్ ఒకటే ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.

తాజాగా పవన్ కళ్యాణ్ తో హరీష్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు బయటకొచ్చి వైరల్ గా మారాయి. దీంతో ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చాడు హరీష్. పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని హరీష్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. సినిమా లవర్స్ ఇటువంటి రూమర్స్ అస్సలు పట్టించుకోవద్దని, తన నుండి కాని లేదంటే ప్రొడక్షన్ హౌజ్ నుండి ఏదైన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తేనే నమ్మాలంటూ హితవు పలికాడు.

ప్రస్తుతం హరీష్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో వాల్మీకి అనే చిత్రం షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన జిగర్తాండ్రా మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇక పవన్ – హరీష్ కాంబినేషన్ లో సినిమా లేనట్టే అని క్లారిటీ వచ్చేయడంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Leave a comment