మహేష్ మూవీపై బాంబ్ పేల్చిన దర్శకుడు

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రెస్టీజియస్ మూవీపై మొదట్నుండీ మంచి అంచనాలు ఉండటంతో సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు. కాగా ఈ సినిమా సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో జనాలు ఈ సినిమాకు కావాల్సినంత బూస్ట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను రివీల్ చేశాడు.

ప్రస్తుతం సమ్మర్ హాలీడేస్ అంటూ ఫారిన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబుతో తన నెక్ట్స్ సినిమా కోసం స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు అనిల్ చెప్పాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు ఎఫ్2 దర్శకుడు. స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు.. షూటింగ్ అతి త్వరలో మొదలుకానుందని ఇమోజీల ద్వారా అనిల్ రావిపూడి తెలియపరిచాడు. ఈ సినిమా స్క్రిప్టుపై మనోడు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తన ట్వీట్ చూస్తే తెలుస్తోంది.

ఇక ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలో నటిస్తాడని చిత్ర యూనిట్‌ అంటోంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్, వగైరా విషయాలు తెలియాలంటే చిత్ర షూటింగ్ మొదలు కావాల్సిందే.

Leave a comment