పూనమ్ ని వదలబొమ్మాళీ వదలా అంటున్నారు..!

పూనమ్ కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లక్కారు. తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి పూనమ్‌కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.అడిషనల్ డీసీపీ రఘువీర్‌ను కలిసిన పూనమ్ తన కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రఘువీర్ మీడియాతో మాట్లాడుతూ, పూనమ్ 36 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశారని తెలిపారు. ఏడాదిన్నర క్రితం తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు.. తన ఫ్రెండ్‌తో మాట్లాడిన కొన్ని మాటలను ఇటీవలి కాలంలో కొంతమంది బయటపెట్టారని.. వాటిని తొలగించాలని ఆమె ఫిర్యాదు చేశారు. కోటి, బన్నీ అనే ఇద్దరు వ్యక్తులపై ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

అంతే కాదు తనకు సంబంధించిన 20-25 ఆడియో క్లిప్పింగ్స్‌‌ ఆయా వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానెల్స్ ద్వారా బయటకొచ్చాయని.. వాటిని తొలగించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. పూనమ్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. పూనమ్ 36 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని రఘువీర్ తెలిపారు.

Leave a comment