మజిలీ వరల్డ్ వైడ్ బిజినెస్ అదరగొట్టింది.. ఇది అంతా సమంత వల్లేనా..!

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన సినిమా మజిలీ. శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ పిక్చర్స్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. సమంతతో పాటుగా ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటించింది. ఉగాది కానుకగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మజిలీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టేస్తుంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ మొత్తం 21 కోట్లకు అమ్ముడయినట్టు తెలుస్తుంది.

పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటించడంతో పాటుగా నిన్ను కోరి లాంటి యువత మెచ్చిన సినిమాను చేసిన డైరక్టర్ శివ చేస్తున్న రెండో ప్రాజెక్ట్ గా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మజిలీ టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఏరియాల వారిగా మజిలీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ చూస్తే..

నైజాం : 6 కోట్లు

సీడెడ్ : 2.50 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.98 కోట్లు

ఈస్ట్ : 1.44 కోట్లు

వెస్ట్ : 1.12 కోట్లు

కృష్ణా : 1.28 కోట్లు

గుంటూరు : 1.62 కోట్లు

నెల్లూరు : 0.70 కోట్లు

ఏపి/తెలంగాణ : 16.64 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.50 కోట్లు

ఓవర్సీస్ : 3 కోట్లు

వరల్డ్ వైడ్ : 21.14 కోట్లు

Leave a comment