అల్లు అర్జున్.. ఏంటి వెయిటింగ్ బాబు..!

నా పేరు సూర్య రిలీజై ఏడాది కావొస్తున్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమాల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రం తో సినిమా కన్ఫాం చేసిన బన్ని ముహుర్తం పెట్టకుండా వెయిటింగ్ లో పెట్టాడు. అల్లు అర్జున్ 19 త్రివిక్రంతో ఫిక్స్ అవగా.. 20వ సినిమా సుకుమార్ డైరక్షన్ లో చేస్తాడని ఎనౌన్స్ చేశారు. అయితే త్రివిక్రం చెప్పిన కథ అటు ఇటుగా నచ్చిందట దాని మీద రిస్క్ చేయడం అవసరమా అన్న ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్.

మరో పక్క సుకుమార్ చెప్పిన కథలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయట. అందుకే త్రివిక్రం సినిమా చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నాడట బన్ని. ఆల్రెడీ త్రివిక్రం సినిమా కన్ఫాం చేశాక అతన్ని కాదని సుకుమార్ సినిమా చేసే అవకాశం లేదు కాని మహేష్ సుకుమార్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టుగా ఎనౌన్స్ చేసినా కథ నచ్చకపోతే సైలెంట్ గా పక్కకు వెళ్లడం కామనే.

అయిన లేటు ఎలాగు అయ్యింది కాబట్టి జూన్ దాకా ఆగి సుకుమార్ తోనే కొత్త సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడట అల్లు అర్జున్. మరి త్రివిక్రంకు నిజంగానే బన్ని హ్యాండ్ ఇస్తాడా.. బన్ని 19వ సినిమా త్రివిక్రం తోనా.. సుక్కు తోనా అన్నది తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Leave a comment