అమ్మో విజయశాంతి ఎక్కడా తగ్గడం లేదే..!

90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయిన విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది. కానీ అలాంటి సినిమాలు వరుసగా రావడంతో ప్రేక్షకులకు దూరం అయ్యింది. ఏ సినిమా హిట్ కాకపోవడంతో సినిమాలకు పులిస్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లింది.

మొదటి బీజేపీ తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్లింది. మెదక్ ఎంపీగా కొనసాగిన ఆమె తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ కి గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ లోకి వెళ్లింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్న విజయశాంతి ఇప్పుడు మరోసారి ముఖానికి రంగు వేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేసిందట. ఆమె డిమాండ్ కి మొదట భయపడినప్పటికీ , విజయశాంతి కున్న క్రేజ్ కి ఆ మొత్తం ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదని అనుకున్నారట అయితే కొద్దిగా బేరమాడి కోటిన్నర కు తెగ్గొట్టారని తెలుస్తోంది. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మహేష్ బాబు – విజయశాంతి కలిసి నటిస్తున్న చిత్రం కావడం విశేషం .

Leave a comment