బిగ్ బాస్ – 3 తెరపైకి అర్జున్ రెడ్డి..

తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 2 పూర్తయ్యింది. మొదట బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ తర్వాత సినీ షూటింగ్ బిజీలో ఉండటంతో బిగస్ బాస్ 2 కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే మొదటి నుంచి బిగ్ బాస్ 2 పై రక రకాల కామెంట్స్ వినిపించాయి. ఇంటి సభ్యుల వ్యవహార శైలి బాగా లేదని..నాని సరిగా హోస్ట్ చేయడం లేదని టాక్ వచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 పూర్తయ్యింది.

ఈ సీజన్ కి కౌశల్ విన్నర్ గా నిలిచాడు. ఇప్పుడు బిగ్ బాస్ 3 కి హూస్ట్ గా ఎవరు అన్న విషయంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. గతంలో అల్లు అర్జున్, వెంకటేష్ లేదు ఎన్టీఆర్ మళ్లీ వస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ బిజీలో ఉన్నాడు. దాంతో మీలో ఎవరు కోటీశ్వరుడు కి హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున వస్తున్నాడని వార్తలు వచ్చాయి.

తాజాగా తెరపైకి అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ దేవరకొండ పేరు వినిపిస్తుంది. వాస్తవానికి విజయ్ దేవరకొండకు ‘గీతాగోవిందం’, టాక్సీవాలా సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 కి మనోడితో కానిస్తే..మంచి క్రేజ్ వస్తుందని బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచనలో ఉందట. ఇదే నిజమైతే బుల్లితెరపై విజయ్ దేవరకొండ సందడి అంతా ఇంతా కాదు.

Leave a comment