యంగ్ హీరోతో ముదురు హీరోయిన్.. దుమ్ములేవాల్సిందే!

తెలుగు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పీక్స్ ఫాంలో ఉండి వరుస సినిమాలతో యూత్‌ను ఇంప్రెస్ చేస్తూ సక్సెస్‌ ట్రాక్‌లో దూసుకుపోతున్నాడు. అటు వరుస సినిమాలు చేస్తూనే ఇండస్ట్రీలో మోస్ట్ డిజైరబుల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న దేవరకొండ బుల్లోడు ఇప్పుడో ముదురు హీరోయిన్‌తో సరసాలడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
2
అవును.. ఇది నిజం. మనోడు రొమాన్స్ చేస్తున్న ముదురు హీరోయిన్‌ సౌత్ ఇండియా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఉన్న బ్యూటీ అని తెలుస్తోంది. అయితే ఇదంతా కేవలం రీల్ వరకే పరిమితం కావడం గమనార్హం. విజయ్ దేవరకొండ తమిళ,తెలుగు భాషల్లో ఓ చిత్రం చేసేందుకు ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్ ప్రభుతో ఓ డీల్ కుదుర్చుకున్నాడు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నయనతార నటించనుందనే వార్తు కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా కావడంతో నయన్ కూడా ఈ సినిమా చేసేందుకు గంతేసిందని టాక్.
1
ఏదేమైనా బోల్డ్ హీరోతో ముదురు హీరోయిన్ కాంబినేషన్ అనగానే కోలీవుడ్ వర్గాలు మొత్తం వారిద్దరి వైపే చూస్తున్నాయి. మరి ఈ కాంబో వెండితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని వారు అప్పుడే అంచనాలు వేస్తున్నారు. ఏదేమైనా విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ తెలుగుతో పాటు తమిళంలో కూడా పెరిగే ఛాన్స్ ఈ సినిమాతో రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ రాలేదు.

Leave a comment