బిగ్ షాక్.. మహేష్ మహర్షి కొనేవాళ్లు లేరట..!

సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మహేష్ ఈ సినిమాలో స్టూడెంట్ గా.. కంపెనీ సి.ఈ.ఓగా నటిస్తున్నాడట.

ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా బిజినెస్ విషయంలో నిర్మాతలకు చుక్కెదురైంది. ఓవర్సీస్ లో ఈ సినిమాను 18 కోట్లకు అమ్మాలని చూశారట. అయితే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కేవలం 12 కోట్లు మాత్రమే ఇస్తామంటున్నారట. మహర్షి నిర్మాతలు మాత్రం 18 కోట్ల నుండి దిగట్లేదని తెలుస్తుంది. మహర్షి బిజినెస్ తో నిర్మాతలకు బిగ్ షాక్ తగిలేలా ఉంది.

తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే భారీగానే బిజినెస్ చేస్తుంది. మే 9న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. మరి ఫైనల్ గా మహర్షి ఓవర్సీస్ లో ఎంతకు బేరం క్దురుతుందో చూడాలి.

Leave a comment