అంచనాలు పెంచుతున్న మహర్షి పోస్టర్.. మ్యూజికల్ జర్నీ స్టార్ట్..!

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ మహర్షి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మే 9న రిలీజ్ అవబోతున్న మహర్షి సినిమా మ్యూజికల్ జర్నీ మార్చి 29 నుండి మొదలు కాబోతుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమా మొదటి సాంగ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ తో మీరు స్నేహం చేయండి అంటూ మహర్షి సినిమా నుండి కొత్త పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశాడు వంశీ పైడిపల్లి. మహేష్, నరేష్ ల మధ్య సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయని తెలుస్తుంది. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న మహర్షి సినిమా మహేష్ 25వ సినిమాగా వస్తుంది. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటుందని అంటున్నారు.

మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు అనీల్ రావిపుడితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తారట. సినిమాలో మహేష్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. మహర్షి మే లో రిలీజ్ అవుతుండగా జూన్ నుండి అనీల్ రావిపుడి సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు.

Leave a comment