ఆర్.ఆర్.ఆర్ స్పెషల్ అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కి పండగే..?

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. బాహుబలి తర్వాత జక్కన్న చెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.

హీరోయిన్స్ ఇంకా ఫైనల్ అవని ఈ సినిమా నుండి అప్పుడే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. మార్చి 27న రాం చరణ్ బర్త్ డే కారణంగా ఆర్.ఆర్.ఆర్ లోని అతని ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట. ట్రిపుల్ ఆర్ లో మొదట రివీల్ అయ్యే పాత్ర రాం చరణ్ దే అన్నమాట. ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ బందిపోటు దొంగగా కనిపిస్తాడని తెలుస్తుంది.

రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు కలిసి వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టే రాజమౌళి ఆ ఫస్ట్ లుక్ లో చెప్పాల్సిన విషయం అంతా చెప్పేస్తాడట. దాన్ని బట్టి ఎవరి అంచనాలకు తగినట్టుగా వారు ఊహించేసుకోవచ్చు. ఆర్.ఆర్.ఆర్ లో రాం చరణ్ పాత్ర పేరు రామరాజు అని చెబుతున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.

Leave a comment