వంద కోట్లు తినేసిన ‘రోబో2’

భారతీయ సినీ ఇండస్ట్రీలో స్టార్ దర్శకులు శంకర్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన తీసే సినిమా ఎంతో వైవిద్యంతో ఉండటమే కాదు..మంచి మెస్సేజ్ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు శంకర్ తీసిన సినిమాలు అన్నీ హిట్ గానే నిలిచాయి. అయితే బడ్జెట్ విసయంలో హాలీవుడ్ రేంజ్ లో ఖర్చు చేసే ఈ దర్శకుడు గత సంవత్సరం సూపర్ స్టార్ రజినీకాంత్ తో తెరకెక్కించిన 2.0 అనుకున్న అంచనాలు అందుకోలేక పోయింది. గతంలో హీరో విక్రమ్ తో ‘ఐ’ సినిమాకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది నిర్మాతను దెబ్బ తీశాడు.

తర్వాత ‘2.0’ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. అప్పట్లో ఈ సినిమా బాహుబలి 2 ని బీట్ చేస్తుందని అందుకోసమే భారీగా దాదాపు రూ.545 కోట్లు బడ్జెట్ పెట్టించాడు. కానీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆ మొత్తాన్ని రికవర్ చేసుకోలేకపోయింది. అయితే శంకర్ పై నమ్మకంతో మరో సినిమాకు ఓప్పందం చేసుకున్నారు. ఒకప్పుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ సీక్వెల్ ‘ఇండియన్-2’ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది. అయితే శంకర్ యధావిధిగా బడ్జెట్‌ను హద్దులు దాటించేస్తున్నాడని నిర్మాణ సంస్థకు అర్థమై అతడికి ఆంక్షలు పెట్టినట్లు సమాచారం.

రూ. 250 కోట్లలోపు ఖర్చుతో ఫస్టుకాపీ చేతిలో పెడతానని అగ్రిమెంట్ చేయమన్నట్టుగా సమాచారం.ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌లో ఉందీ సినిమా. అయితే లైకా వాళ్లతో దర్శక నిర్మాతల మధ్య గొడవ నేపథ్యంలో షూటింగ్ తాత్కాలికంగా ఆగినట్లు సమాచారం. అవసరమైతే నిర్మాతల్ని మార్చాలని శంకర్ చూస్తున్నాడట. నిజానికి ఈ చిత్రాన్ని మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాల్సింది. బడ్జెట్ విషయంలో మనోడు ముందుకు రాకపోవడంతో లైకా ప్రొడక్షన్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థ కూడా ఆంక్షలు పెట్టడంతో సినిమా పరిస్తితి ఏంటో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Leave a comment