Gossipsటాప్ రేటు పలుకుతున్న పూజ హెగ్డే..!

టాప్ రేటు పలుకుతున్న పూజ హెగ్డే..!

ఒక లైలా కోసం అంటూ నాగచైతన్యతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల కన్నడ భామ పూజ హెగ్డే … ముకుంద లో పల్లెటూరి అమ్మాయిలా కన్పించింది.. కానీ అటు బాలీవుడ్‌ వెళ్లి మొహేంజోదరో చేసి మళ్లీ టాలీవుడ్‌కి వచ్చిందో లేదో దువ్వాడ జగన్నాధం సినిమాలో అందం మొత్తం అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చింది.

అయితే ఈమె నటించిన సినిమాలు భారీ హిట్లు కొట్టకపోయినా… ఈ అమ్మడికి ఛాన్స్ లు అయితే తగ్గలేదు. దువ్వాడ జగన్నాధం సినిమా తో అందాల ఆరబోతకు తనకు సిద్దమే అంటూ… హింట్ ఇవ్వడంతో వరుస వరుస ఆఫర్స్ తో దూసుకుళ్తోంది ఈ డీజే భామ.

‘అరవింద సమేత’లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం ఒకే సమయంలో మహేష్, ప్రభాస్ లతో బిజీ బిజీ అయిపొయింది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందుతుండడంతో…ఈ అమ్మడికి బాగానే గిట్టుబాటు అయ్యిందట. ఒక్కో సినిమాకి ఈమె రూ. 1.75 కోట్లు తీసుకుంటోందట.

ఇక ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే… రేటు మరింత పెంచేందుకు సిద్ధంగా ఉందట. టాలీవుడ్ లో నే కాదు బాలీవుడ్ లోనూ… వరుస వరుసగా ఆఫర్స్ వస్తుండడంతో… హిట్ , ప్లాప్ అనే బేధం లేకుండా… వరుస వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news