నయనతార పెళ్లి.. చాలా పెద్ద టార్గెట్ పెట్టింది..!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా అంచెలంచలుగా ఎదుగుతూ వస్తున్న భామ నయనతార కోలీవుడ్ లో ఆమె సినిమా అంటే అక్కడ స్టర్ హీరోలు కూడా భయపడే పరిస్థితి ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలతో తమిళనాట సంచలన విజయాలను అందుకుంటున్న నయనతార ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. ఏ హీరోయిన్ కూడా చేయని ప్రయోగాలతో నయన్ సినిమాలు చేస్తుంది. ఇక తెలుగులో కూడా సీనియర్ స్టార్స్ కు ఆమె బెటర్ ఆప్షన్ అయ్యింది. అందుకే ఇక్కడ అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది అమ్మడు.

ఇక పెళ్లి ప్రస్థావన తెస్తే మాత్రం మాట దాటవేస్తుంది. విఘ్నేష్ శివన్ తో కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న నయనతార పెళ్లెప్పుడు అంటే మాత్రం నోరు విప్పదు. అయితే ఈమధ్య ఆమె 100 సినిమాలు చేస్తే కాని పెళ్లి చేసుకోనని చెప్పిందట. 100 సినిమాలు చేసి కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే చిన్న బడ్జెట్ తోనే కొత్త కొత్త ప్రయోగాలతో వరుసగా సినిమాలు చేస్తుంది. అయితే ప్రస్తుతం 60 సినిమాలు చేసిన నయనతార ఇంకా 40 సినిమాలు చేయాలి.

మరి ఈ 40 సినిమాలు చేస్తుందా.. లేక మధ్యలోనే రేసు ఆపేసి పెళ్లాడుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే చెప్పినట్టుగా సినిమాల్లో ఏది జరుగదు. ఇప్పుడంటే సక్సెస్ లు వస్తున్నాయి కాబట్టి వరుస సినిమాలు చేస్తుంది. ఒకటి రెండు ఫ్లాప్ అయితే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. మొత్తానికి ఒకవేళ ఇయర్ కు 6,7 సినిమాలు చేసినా మరో ఐదారేళ్ల దాకా నయన్ పెళ్లి చేసుకోదని చెప్పొచ్చు.

Leave a comment