మహేష్ ను సర్ ప్రైజ్ చేసిన ఆ దర్శకుడు..!

Mahesh next with star director?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. అయితే రీసెంట్ గా మహేష్ కు సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి ఓ కథ చెప్పాడట. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస విజయాలను అందుకుంటున్న అనీల్ రావిపుడి తన కథతో మహేష్ ను సర్ ప్రైజ్ చేశాడట.

మహేష్ కు కూడా ఓ మాస్ కథను చెప్పాడట అనీల్ రావిపుడి. అతని నరేషన్ కు మహేష్ షాక్ అయ్యాడట. కచ్చితంగా ఇది వర్క్ అవుట్ అవుతుందని అనిపించిందట. అందుకే సుకుమార్ సినిమా తర్వాత తనని లైన్ లోకి తీసుకొచ్చాడు. అసలైతే సుక్కు తర్వాత అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగతో సినిమా చేస్తాడని అన్నారు. కాని ఇప్పుడు మహేష్ అనీల్ కాంబో ఫిక్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తాడట. ఆల్రెడీ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మహర్షి సినిమాకు దిల్ రాజు ఒక నిర్మాతగా ఉన్నారు.

ఇక మహర్షి సినిమా విషయానికొస్తే పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే.

Leave a comment