‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’కవ్విస్తూనే..పిచ్చెక్కిస్తుంది..!

టాలీవుడ్, కోలీవుడ్ లో హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అందం..అభినయం ఉన్నా ఈ అమ్మడికి పెద్దగా సక్సెస్ లు కలిసి రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా అక్కడా కూడా పెద్దగా కలిసి రాలేదు. దాంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ కుర్రాళ్ల మతులు పొగొడుతుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో రత్తాలు రత్తాలు అనే పాటకు స్టెప్పులేసింది.

ఆ మద్య లారెన్స్ నటించిన కాంచన 2 చిత్రంలో నటించింది. కన్నడ ఇండస్ట్రీలో కూడా కొన్ని చిత్రాల్లో నటించిన రాయ్ లక్ష్మీ తాజాగా కృష్ణ కిషోర్ దర్శకత్వంలో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’అనే మూవీలో నటిస్తుంది. ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో ఈ సినిమాని నిర్మాత‌లు గురునాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.

తాజాగా ఈ ట్రైలర్ చూస్తుంటే ఓళ్లు గగుర్బోడిచే సన్నివేశాలు ఉన్నట్లు అనిపిస్తుంది. ట్రైలర్ మొదట ప్రవీన్, మధు నందన్ కామెడీ సన్నివేశాలు చూపించారు..ఆ తర్వాత రాయ్ లక్ష్మీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హర్రర్, థ్రిల్లర్ సీన్లు కట్ చేశారు. ఈ మూవీలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తుండగా.. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. హ‌రి గౌర సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Leave a comment