సర్జికల్ స్ట్రైక్స్2 పై సినీ తారల ప్రశంసలు..!

భారత సర్జికల్ స్ట్రయిక్స్ పై టాలీవుడ్ ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కాగా, నేటి ఉదయం బాలాకోట్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. భారత వాయు సేన 29 నిమిషాల పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది ఇక ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.

ఇండియన్ ఆర్మీ చ‌ర్య పై దేశ‌మంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. ఈ నేప‌ధ్యంలో భార‌త సైన్యాన్ని ప్రశంసిస్తూ తాజాగా సినీ తార‌లు సోష‌ల్ మీడియాలో స్పందిస్తున్నారు. టాలీవుడ్ ద‌ర్శ‌క, న‌టులు.. రాజమౌళి, ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు, కమల్‌ హాసన్‌, రామ్‌ చరణ్‌, అఖిల్, వరుణ్ తేజ్‌, మంచు విష్ణు, మెహరీన్‌, సోనాక్షి సిన్హా, నితిన్‌, ఉపాసనల‌తో పాటు పలువురు సినీ ప్ర‌ముఖులు ట్వీట్లు చేస్తున్నారు.

-సెల్యూట్ టూ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్… జై హింద్” : రాజమౌళి
– “భారత వాయుసేనను చూసి గర్విస్తున్నా… జై హింద్” : రాంచరణ్
– “ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి గర్విస్తున్నాను. ధైర్యవంతులైన ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్” : మహేష్ బాబు
– “మన దేశం గట్టి జవాబు ఇచ్చింది. భారత వాయుసేనకు సెల్యూట్ చేస్తున్నా” :ఎన్టీఆర్
– భారత వైమానిక దళానికి సెల్యూట్‌. జై హో. జై హింద్‌’- నితిన్‌
– బుల్లెట్‌ దిగిందా లేదా..’- పూరీ జగన్నాథ్‌
– ‘సెల్యూట్‌ ఐఏఎఫ్‌. మన దేశానికి ఎంతో గర్వకారమైన రోజిది’- అఖిల్‌
– జై హింద్‌. ఈ మెరుపు దాడుల వార్త నిజమేనని ఆశిస్తున్నా’- మంచు విష్ణు
– చేతులు ముడుచుకుని కూర్చునే టైం కాదని ప్రపంచానికి మనం నిరూపించాం. భారత వైమానిక దళానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’- కల్యాణ్‌రామ్‌
– ఎవడు కొడితే ఉగ్ర శిబిరాలన్నీ బ్లాక్‌ అయిపోతాయో వాళ్లే మన సైనికులు’- బ్రహ్మాజీ
– భారత వైమానిక దళాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది’- ఉపాసన
– ‘జైషే పరిస్థితి ఎలా ఉంది?.. ‘నాశనమైపోయింది‌’- రష్మి

Leave a comment