మోహన్ బాబు పై ఫైర్ అయినా చిరు..?

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఇదే సమయంలో టాప్ విలన్ గా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు. మోహన్ బాబు హీరోగా యూటర్న్ తీసుకున్న తర్వాత విలన్ గా ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్ బాబు లకు కార్టూన్ నెట్ వర్క్ లో టామ్ అండ్ జర్రీ లా ఉంటారని టాక్ వినిపిస్తుంది. గతంలో కొన్ని కార్యక్రమాల్లో వీరిద్దరు ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శించుకున్న సందార్బాలు కూడా ఉన్నాయి.

కానీ ఎప్పటికప్పుడూ వీరిద్దరూ స్నేహపూర్వకంగానే ఉంటున్నాం అంటూ మీడియా సాక్షింగా మాట్లాడుతుంటారు. తాజా టి.ఎస్‌.ఆర్ టీవీ 9నేషనల్‌ అవార్డుల (2017 – 2018) 5వ వార్షికోత్సవ ప్రధానోత్సవం ఫిబ్రవరి 17న విశాఖపట్నం లో అశేష జనవాహిని మధ్య సినీ పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో సినీ తారల ఆట పాటలతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆంద్రప్రదేశ్ మంత్రి వర్యులు శ్రీ ఘంటా శ్రీనివాస్ గారు హాజరయ్యారు.

ఈ వేడుకలో చిరంజీవి, మోహన్ బాబు,బాలకృష్ణ, నాగార్జున, విశాల్, తో పాటు మరెందరో సినీ ప్రముఖులు ఒకే వేదికపై పాలుపంచుకున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..మంత్రి వర్యులు శ్రీ ఘంటా శ్రీనివాస్ గారికి,సోదరుడు బాలక్రిష్ణ కి ,నా మనసుకు చాలా దగ్గరైన నాగార్జున..పెద్దలు మోహన్ బాబు అనగానే..వెంటనే మోహన్ బాబు, చిరంజీవి వద్దకు వచ్చి నేను పెద్ద ఏంటీ అనగానే మరోసారి కుర్రాడైన మోహన్ బాబు అంటూ నవ్వుతూ సంబోధించాడు.

ఈ క్రమంలో తన తనయుడు రాంచరణ్ గురించి కొన్ని విశేషాలు చెప్పిన తర్వాత మోహన్ బాబు అక్కడకు వచ్చి మా గురువుగారి సగం అవార్డు నీకు ఇస్తున్నా అంటూ కొడుకు విజయమే తండ్రి విజయం..నువు అవార్డు లేదన్నావ్..నా అవార్డు నీకు నీ కొడుక్కీ ఇస్తున్నా అన్నారు. వెంటనే చిరంజీవి అలా కాదు..ఈ అవార్డు మనిద్దరం పంచుకుందాం అనడంతో వేదిక వద్ద అక్కడ నవ్వులు..చప్పట్లు వినిపించాయి.

Leave a comment