ఎన్టీఆర్‌కు తలనొప్పిగా మారిన ఇద్దరు.. ఎవరో తెలుసా?

తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో నందమూరి తారక రామారావు జీవితకథను ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో ఆయన కొడుకు నందమూరి బాలకృష్ణ రెడీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.

అయితే ఈ సినిమాకు ఎప్పటికప్పుడు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ నుండి మరో అడ్డంకి ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు పాత్రలను నెగెటివ్‌గా చూపించారని సెన్సార్ అడ్డు చెప్పినట్లు ఫిలింనగర్ టాక్. అయితే వారి దగ్గర్నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుందట. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అనే టాపిక్‌పై అనేక వార్తలు వినిపిస్తుండగా.. వారు లక్ష్మీ పార్వతి మరియు నాదెండ్ల భాస్కర్ రావు అని తెలుస్తోంది. ఈ విషయంపై స్పష్టత లేకపోయినా, సినిమా రిలీజ్‌కు అడ్డంకిగా మారడంతో చిత్ర యూనిట్ కాస్త టెన్షన్ పడుతుంది.

ఏదేమైనా ఎన్టీఆర్ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుండగా ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని కొందరు ఎదురు చూస్తుండగా.. ఎలాంటి వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుందా అని క్రిటిక్స్ ఎదురు చూస్తున్నారు.

Leave a comment