Moviesకుర్రాడి స్పీడ్ బాగుంది.. మరో ఆరెక్స్ 100 చేస్తున్నాడా..!

కుర్రాడి స్పీడ్ బాగుంది.. మరో ఆరెక్స్ 100 చేస్తున్నాడా..!

అజయ్ భూపతి డైరక్షన్ లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన సినిమా ఆరెక్స్ 100. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా సంచలన విజయం అందుకుంది. సినిమా కథ, కథనాలే కాదు ప్రమోషన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. ఇక సినిమాలో ముద్దు సీన్స్ యూత్ ఆడియెన్స్ కు భలే నచ్చేశాయి. నడుస్తున్న ట్రెండ్ ను కళ్లకు కట్టినట్టు చూపిచిన ఆరెక్స్ 100 సినిమా హీరో కార్తికేయకు సర్ ప్రైజ్ హిట్ ఇచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత ఏదో ఒక సినిమా చేయకుండా చాలా కథలు విని ఫైనల్ గా మళ్లీ ఆరెక్స్ 100 లాంటి కథతో వస్తున్నాడట.

ఈసారి కూడా నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాలను పరిచయం చేస్తూ అతని డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు కార్తికేయ. ఈ మూవీలో మరో కొత్త భామని పరిచయం చేస్తున్నాడు. మళయాళ భామ అనఘా మరతొర కార్తికేయతో రొమాన్స్ చేయనుంది. ఆల్రెడీ తమిళంలో నట్పే తునై సినిమాలో నటించి మెప్పించిన ఈ హీరోయిన్ తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ఇదే అవడం విశేషం. ఆరెక్స్ 100 తర్వాత కార్తికేయకు యూత్ లో భారీ ఫాలోయింగ్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news