ఎఫ్-2 5 డేస్ కలక్షన్స్.. సంక్రాంతి సూపర్ హిట్ ఇదే..!

F2 5 days collections

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. దిల్ రాజు బ్యానర్ లో అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సీజన్ లో వచ్చిన మిగతా మూడు సినిమాలు పెద్దగా ప్రభావితం చూపించకపోయే సరికి ఎఫ్-2 వసూళ్ల హంగామా చేస్తుంది. వరల్డ్ వైడ్ గా 34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఎఫ్-2 5 రోజుల్లోనే అది రికవర్ చేసిందని తెలుస్తుంది.

5 రోజుల్లో ఈ సినిమా 32.03 కోట్ల షేర్ వసూళు చేసింది. మరో వారం దాకా ఎఫ్-2 కలక్షన్స్ ఇలానే ఉండేలా కనిపిస్తున్నాయి. వెంకీ మార్క్ కామెడీతో అనీల్ రావిపుడి డైరక్షన్ టాలెంట్ మరోసారి అతనికి సూపర్ హిట్ తెచ్చిపెట్టింది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న అనీల్ రావిపుడి ఎఫ్-2 హిట్ తో డబుల్ హ్యాట్రిక్ షురూ చేశాడు. ఇక ఎఫ్-2 5 రోజుల కలక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 8.96 కోట్లు

సీడెడ్ : 3.42 కోట్లు

ఉత్తరాంధ్ర : 3.15 కోట్లు

ఈస్ట్ : 3.09 కోట్లు

వెస్ట్ : 1.74 కోట్లు

కృష్ణా : 2.30 కోట్లు

గుంటూరు : 2.33 కోట్లు

నెల్లూరు : 0.84 కోట్లు

ఏపి/తెలంగాణా: 25.83 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.90 కోట్లు

ఓవర్సీస్ : 4.30 కోట్లు

వరల్డ్ వైడ్ : 32.3 కోట్లు

Leave a comment