GossipsRRRలో బాలీవుడ్ బ్యూటీ.. కొట్టుకోనున్న తారక్-చరణ్

RRRలో బాలీవుడ్ బ్యూటీ.. కొట్టుకోనున్న తారక్-చరణ్

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర ఇండస్ట్రీలోని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తు్న్నారు. బాహుబలి దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భీబత్సంగా ఉన్నాయి. ఇక ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమాలో తారక్-చరణ్‌ల కోసం హీరోయిన్ల వేటి ఇంకా సాగుతోంది. అయితే ముగ్గురు హీరోయిన్ల కోసం జక్కన్న అండ్ టీమ్ వేటాడుతోండగా.. ఒక హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న పరిణీతి చోప్రాను ఒక హీరోయిన్‌గా ఒప్పించేందుకు రాజమౌళి అండ్ టీమ్ సిద్ధమైందట. అయితే అమ్మడు అదిరిపోయే పారితోషకం అడగడంతో చిత్ర యూనిట్ ఆమెను లైన్‌లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఒకవేళ ఇదే నిజమైతే.. పరిణీతి చోప్రాను ఎవరి పక్కన హీరోయిన్‌గా పెడతారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా ప్రేక్షకులకు మిగులుతుంది. తారక్, చరణ్‌లలో పరిణీతి కోసం ఎవరు పోట్లాడుతారో కూడా చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం ఈ టాపిక్ ఫిలింనగర్‌లో బాగా వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news