Gossipsనాగబాబుకి బాలయ్య పవరేంటో చూపించిన నందమూరి ఫ్యాన్స్..!

నాగబాబుకి బాలయ్య పవరేంటో చూపించిన నందమూరి ఫ్యాన్స్..!

మెగా బ్రదర్ నాగబాబు ఈమధ్య నందమూరి బాలకృష్ణని డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా బయోపిక్ మీద కూడా కట్టు కథలు.. కల్పితాలు అంటూ సెన్సేషనల్ క్రియేట్ చేయగా ఆ తాకిడితో నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం ఆకాశాన్నంటిందని చెప్పాలి. ఇక సరైన టైం రాకపోద్దా బాలయ్య సత్తా చూపించేయాలని ఉత్సాహపడుతున్న ఫ్యాన్స్ కు చెన్నై వెల్ టెక్ కాలేజ్ ఈవెంట్ లో బాలయ్య ఫ్యాన్స్ కు అడ్డంగా బుక్ అయ్యాడు నాగబాబు.

అక్కడ మైక్ అందుకుని మాట్లాడుతున్న నాగబాబు మాటలు ఏమాత్రం అర్ధం కాకుండా జై బాలయ్య జై జై బాలయ్య అంటూ కేకలేశారు నందమూరి ఫ్యాన్స్. నందమూరి ఫ్యాన్స్ సత్తా ఏంటో ఈ దెబ్బకు తెలుస్తుంది. నందమూరి ఫ్యాన్స్ కేకలకు బెంబేలెత్తిపోయిన నాగబాబు తన ప్రసంగం మొదలు పెట్టకముందే మాట్లాడకుండా వెళ్లిపోయాడు. సో మొత్తానికి నాగబాబు, బాలకృష్ణల మధ్య ఈ యుద్ధం అభిమానులు ఎంత ప్రెస్టిజియస్ గా తీసుకున్నారో అర్ధమవుతుంది.

ఇక నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ ఎలా స్పందిస్తాడు అన్న విషయమై అందరు ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. పక్క రాజకీయ సమ్మేళనాలుగా కనిపిస్తున్న ఈ సందర్భాన్ని ఎవరు ఎలా డీల్ చేస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓ పక్క ఏపిలో జనసేన కూడా అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడం మెగా నందమూరి అభిమానుల మధ్య ఈ గొడవ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news