వెంకటేష్ 75కు అదిరిపోయే కాంబినేషన్..!

విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా నటించిన ఎఫ్-2 సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటుగా వరుణ్ తేజ్ కూడా నటించాడు. ఇక ఈ సినిమాతో వెంకటేష్ మళ్లీ ఫాంలోకి వచ్చేసినట్టే అని చెప్పుకుంటున్నారు. మహేష్ ఎఫ్-2 సినిమా తన కెరియర్ లో 73వ సినిమా అని తెలుస్తుంది. 74వ సినిమాగా వెంకీమామా సినిమా చేస్తున్నాడు. మేనళ్లుడు నాగ చైతన్యతో ఆ సినిమా కూడా మల్టీస్టారర్ గా చేస్తున్నాడు వెంకటేష్.

ఇదిలాఉంటే వెంకటేష్ 75వ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. కొన్నాళ్లుగా వెంకటేష్ 75వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. త్రివిక్రం డైరక్షన్ లో వెంకీ 75వ మూవీ ఉంటుందట. త్రివిక్రం రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ సినిమాలకు పనిచేశాడు కాని ఆయన దర్శకుడిగా మారాక మాత్రం చేయలేదు. అందుకే త్రివిక్రం, వెంకీ కాంబో సెట్ అవుతుందట. ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుందట. కచ్చితంగా అంచనాలను అందుకుంటే మాత్రం వెంకటేష్ సినిమా రికార్డులు సృష్టించగలదు అని ఎఫ్-2 సినిమా ప్రూవ్ చేసింది. ఫైనల్ గా వెంకీ ల్యాండ్ మార్క్ మూవీపై వస్తున్న మ్యూస్ దగ్గుబాటి ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తున్నాయి.

Leave a comment