మెగా స్టార్ తో ఫోర్న్ స్టార్.. షాక్ లో సినీ ఇండస్ట్రీ..!

ఫోర్న్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది స్టార్ హీరోయిన్ ల క్రేజ్ కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఇమేజ్ సంపాదించుకుంది సన్నిలియోన్.. ఆమె మన దేశంలో అడుపెట్టిన దగ్గర నుంచి చిన్నో..పెద్దో ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంది. అసలు మొదటగా బాలీవుడ్ లోకి ప్రవేశించిన ఈ ఫోర్నస్టార్ అక్కడి నుంచి టాలీవుడ్ కోలీవుడ్ అనే బేధం లేకుండా అవకాశం దొరికిన ప్రతి చోట తన పెరఫామెన్స్ బయటపెట్టుకుంటోంది.

సన్నీలీయోన్ నటించిన సినిమాలు తక్కువే అయినా..వివాదాలు మాత్రం ఎక్కువే. అందుకేనేమో ఆమె అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. ఫోర్న్ ప్రపంచం నుంచి బాలీవుడ్ లోకి వచ్చిన సన్నీలియోన్ గతలో పలు విమర్శలు ఎదుర్కొన్నా..ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ తో దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో కూడా సన్నీలియోన్ కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నటించింది.

ఇక ఈ అమ్మడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న సినిమాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది.ఆయన నటించిన కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా బెస్ట్ కలెక్షన్లు సాధించన సంఘటనలు ఉన్నాయి. యాక్టింగ్ లో నేషనల్ వైడ్ గా బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న ఈ మెగాస్టార్ ఇప్పుడు సన్నీ లియోన్ తో చిందులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మమ్ముట్టి నటిస్తోన్న సినిమా మధుర రాజా. 2010లో వచ్చిన సూపర్ హిట్ సినిమా పొక్కిరి రాజాకు ఇది రీమేక్ ఈ సినిమాలో మమ్ముట్టి ఓ కాంట్రవర్సల్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో సన్నీలియోన్ చిందులేయ బోతుందట.

Leave a comment