మహేష్ ‘మహర్షి’ సినిమా లీక్..

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అయితే మహేష్ ఈ సినిమాలో ఓ బిలీనియర్ గా కనిపిస్తూనే మరోపక్క తన స్నేహితుడి కోసం పల్లెటూరికి వచ్చి అక్కడ అభివృద్ధి పనులు చేస్తాడట. అయితే ఈ సినిమాకు సంబందించిన సీన్స్ కొన్ని ఆన్ లైన్ లో లీక్ అయ్యాయని తెలుస్తుంది.

మహేష్ విలేజ్ లో మీడియాతో మాట్లాడుతున్న సీన్ తో పాటుగా.. పొలాల్లో నడుచుకుంటూ వచ్చే సీన్ ఒకటి లీక్ అయ్యిందట. ఈ వీడియో లీక్ కారణం మహేష్ బాబు ఫ్యాన్సే అంటున్నారు. షూటింగ్ టైంలో ఎవరో మహేష్ అభిమాని ఈ వీడియో తీసి ఏకంగా ఇన్ స్టాగ్రాం లో పెట్టేశాడు. అది తెలుసుకున్న చిత్రయూనిట్ షాక్ అయ్యింది. మహర్షి సినిమా లీక్ వ్యవహారం పై మహేష్ కూడా చాల సీరియస్ గా ఉన్నాడని అంటున్నారు.

ఫ్యాన్స్ వల్లే మహర్షి లీక్ అవడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే లీక్ చేసిన వీడియో పెద్దగా క్లారిటీ లేకపోవడమే కాకుండా పెద్దగా అర్ధం కాని విధంగా ఉండటం వల్ల హమ్మయ్య అనుకున్నారు మహర్షి మేకర్స్. ఏప్రిల్ 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మహేష్ బాబు 25వ సినిమాగా వస్తుండటంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Leave a comment