దిల్ రాజుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

ఈ ఇయర్ నిర్మాతం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకి గుడ్ స్టార్ట్ జరిగిందని చెప్పాలి. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2 ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత దిల్ రాజు ఇలాంటి మీడియం బడ్జెట్ మూవీస్ చేసుకోవడమే బెటర్ అని మరోసారి ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మహేష్ బాబు మహర్షి పూర్తి కాగానే దిల్ రాజు ఇక వరుసగా మీడియం, స్మాల్ బడ్జెట్ మూవీస్ పై దృష్టి పెడతాడని తెలుస్తుంది. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 96 రీమేక్ ప్రయత్నాల్లో ఉన్న దిల్ రాజు ఆ సినిమా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు కొత్త సినిమాలను లైన్ లోకి తెస్తున్నారు.

ఇక యువ సంచలనం విజయ్ దేవరకొండతో దిల్ రాజు ఓ సినిమా ప్లాన్ చేశాడు. అయితే విజయ్ అడిగిన రెమ్యునరేషన్ కు దిల్ రాజు షాక్ అయ్యాడట. తనతో సినిమా అంటే 10 కోట్లు రెమ్యునరేషన్ కావాల్సిందే అన్నాడట విజయ్ దేవరకొండ. అప్పుడే మనోడికి అంత సీన్ వచ్చిందా అంటే టాక్సీవాలా మళ్లీ లాభాలు తీసుకురావడంతో విజయ్ దేవరకొండ మళ్లీ రెమ్యునరేషన్ పెంచాడని తెలుస్తుంది.

ప్రస్తుతం డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్న దేవరకొండ విజయ్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు క్రాంతి కుమార్ డైరక్షన్ లో కూడా ఓ మూవీ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా తర్వాత దిల్ రాజు సినిమా చేయాల్సి ఉంది. రెమ్యునరేషన్ డీల్ సెట్ అయితే సినిమా ఉంటుందట.. అయితే దిల్ రాజు మాత్రం విజయ్ దేవరకొండకు 10 కోట్లు ఇచ్చేందుకు ఆలోచిస్తున్నాడట.

Leave a comment