త్రివిక్రం అసలు రూపాన్ని బట్టబయలు చేసిన నటి హేమ..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం రైటర్ గా పరిశ్రమకు పరిచయమై తన మాటలతో అందరిని అలరించి ఇప్పుడు దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రం అరవింద సమేత వీర రాఘవ సినిమా వరకు హిట్లు ఫ్లాపులను సమతూకంతో సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే తన సినిమాల్లో నటి హేమ క్యారక్టర్ ఉంటుంది. ఆమెతో కొన్ని పంచులు వేయించడం త్రివిక్రం కు అలవాటే. అయితే ఈమధ్య వారిద్దరి మధ్య సఖ్యత లేక హేమని తన సినిమాల్లోంచి తీసేశాడు త్రివిక్రం.

ఇంతకీ హేమ, త్రివిక్రం ల మధ్య గొడవకు కారణం ఏంటని ఆరా తీస్తే.. ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని బట్టబయలు చేసింది హేమ. తన రెమ్యునరేషన్ గురించి తాను డిసైడ్ చేయడం ఏంటని.. అది నాకు నచ్చలేదని. అందుకే అతనితో మాట్లాడటం మానేశా అంటుంది హేమ. సో త్రివిక్రం, హేమల మధ్య రెమ్యునరేషన్ గొడవలు వచ్చాయన్నమాట. మరి ఏ సినిమాకు ఈ గొడవ మొదలైందో తెలియదు కాని తన రెమ్యునరేషన్ త్రివిక్రం డిసైడ్ చేయడం ఏంటని ఆమె ఆ సినిమా నుండి డ్రాప్ అయ్యిందట.

రెమ్యునరేషన్ మేనేజర్ లేదా ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తాడు కాని డైరక్టర్ గా తన పనేదో తాను చూసుకోకుండా రెమ్యునరేషన్ విషయంలో జోక్యం చేసుకోవడం ఏంటని అంటుంది హేమ. అందువల్లే త్రివిక్రం సినిమాల్లో తాను నటించడం మానేశానని చెప్పుకొచ్చింది హేమ. ఏదిఏమైనా బ్రహ్మానందం, త్రివిక్రం లతో త్రివిక్రం రాసుకునే కామెడీ ట్రాక్ సినిమాకు ప్లస్ అవుతుంది. మరి అలాంటి వారిని ఏదో గొడవ వల్ల సినిమా నుండి తప్పించడం సరైనది కాదు.

త్రివిక్రం, హేమ ఈ గొడవలు సర్ధుమనిగి మళ్లీ ఆమెకు తన సినిమాల్లో మంచి పాత్రలు ఇవ్వాలని ఆశిద్దాం. ఈమధ్య బోయపాటి శ్రీను డైరక్షన్ లో రాం చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో హేమకి మంచి పాత్ర లభించింది. ఆ రోల్ కు ఆమె బాగానే న్యాయం చేసింది. మొత్తానికి త్రివిక్రం అవకాశాలు ఇవ్వకున్నా హేమ కెరియర్ బాగానే నెట్టుకొస్తుంది.