కులమతాల్లో చిచ్చుపెడత.. నాగబాబు..?

మెగా బ్రదర్ నాగబాబు నందమూరి బాలకృష్ణ మీద చేస్తున్న విమర్శనాస్త్రాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ బాలకృష్ణను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బాలకృష్ణ ఎప్పుడో ఎక్కడో మాట్లాడిన మాటలను తీసుకొచ్చి అప్పుడలా అన్నారు ఎందుకు అంటూ నాగబాబు మాట్లాడుతున్నాడు. తాజాగా ప్రతిపక్ష పార్టీ మీద జనసేనను ఉద్దేశించి అలగా జలగం వేసుకుని అంటూ మట్లాడాడని ఎవరు అలగాజలగం అని.. అన్ని పార్టీలో అన్ని కులాలు మతాల వారు ఉంటారని.. అలా విమర్శించడం కరెక్ట్ కాదని అన్నారు నాగబాబు.

అయితే బాలకృష్ణ అన్న మాటని గుర్తుచేసి నాగబాబు మళ్లీ అలాంటి కుల మత ఉద్రేకాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు నందమూరి వర్గాల వారు. బాలకృష్ణ మాటలకు ఎవరు హర్ట్ అవ్వలేదని కేవలం మెగా కాంపౌండ్ వారు మాత్రమే హర్ట్ అయ్యి ఉంటారని నందమూరి ఫ్యాన్స్ కామెంట్. ఇక చివరగా నాగబాబు తన 6వ కామెంట్ అడిగి దానితో ఈ కామెంట్ల వర్షం ఆపేస్తానని చెప్పాడు. నాగబాబు కామెంట్ 1 నుండి రీసెంట్ గా వచ్చిన 5వ కామెంట్ వరకు బాలకృష్ణని మాత్రమే టార్గెట్ చేయడం విశేషం. ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుంది.. నాగబాబు కామెంట్స్ కు బాలకృష్ణ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది చూడాలి.

Leave a comment