ఆ హీరోయిన్ కు ఎంత మిడ్ నైట్ అయినా అది చేయంది నిద్రపట్టదట..!

హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించడమే కాదు.. తమ పర్సనల్ లైఫ్ లో విషయాలతో కూడా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుంటారు సిని తారలు. అయితే వాటిలో ఒక్కో హీరోయిన్ కు ఒక్కో రకమైన వింత అలవాటు ఉంటుంది. కొన్ని అందరు పాటించేవే అనిపించినా కొన్ని మాత్రం విచిత్రంగా ఉంటాయి. అలానే ఓ స్టార్ హీరోయిన్ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నార్త్ నుండి వచ్చి సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఓ స్టార్ హీరోయిన్ కు ప్రతి రోజు ఎంత మిడ్ నైట్ అయినా సరే స్నానం చేయనిది నిద్ర పట్టదట.

అదేంటి ఫ్రెష్ అవడంలో తప్పేముంది.. అది అందరు చేసే పనేగా అనుకోవచ్చు. రెగ్యులర్ గా నిద్రపోయే ముందు స్నానం చేసి పడుకోవడం అందరు చేసే పనే ఆ అమ్మడు కూడా అలానే చేస్తుందట కాని నిద్ర మధ్యలో లేచి స్నానం చేస్తుందట. అలా అప్పుడప్పుడు ఆమెకు నిద్ర మధ్యలో అలా చేయాలని అనిపిస్తుందట. అలా ఒకసారి కాదు తరచు అంటే దాదాపుగా రోజు నైట్ పడుకునే ముందు ఒకసారి మిడ్ నైట్ ఒకసారి హీరోయిన్ బాతింగ్ చేస్తుందట. ఒకవేళ ఏదైనా రోజు మధ్యలో లేవకపోయినా ఆమె అటు ఇటు మెసులుతూ ఉంటుందట. దాని బదులు స్నానం చేసి రావడం బెటర్ అని అలా చేస్తుందట. ఈ వింత అలవాటు ఏంటో తెలియదు కాని షూటింగ్ టైంలో ఈ హ్యాబిట్ కంటిన్యూ అవుతుండగా తన సహ నటులు గుసగుసలాడుతున్నారట.

ఒకవేళ ఆమె శరీరానికి సంబందించి ఏదైనా అనారోగ్య సమస్య వెంటాడుతుందేమో అని డౌట్ పడుతున్నారు. అయితే ఇది కేవలం ఆమెతో సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే తెలిసిన సీక్రెట్ కాబట్టి మీడియా దీనిపై ఫోకస్ పెట్టలేదట. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఇంతకీ ఆమెకు ఉన్న జబ్బు ఏంటన్నది తెలియాల్సి ఉంది. సదరు హీరోయిన్ స్టార్స్ తో నటించినా ఈమధ్య కొద్దిగా బ్యాక్ అయ్యింది 2019లో ఆమె కిట్టీలో క్రేజీ సినిమాలు ఉన్నాయి.

Leave a comment