Gossipsవరుణ్ తేజ్ " అంతరిక్షం " రివ్యూ & రేటింగ్

వరుణ్ తేజ్ ” అంతరిక్షం ” రివ్యూ & రేటింగ్

మెగా హీరో వరుణ్ తేజ్ ఘాజి లాంటి ఓ అద్భుతమైన సినిమా చేసిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి కలిసి చేసిన సినిమా అంతరిక్షం. తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ కాన్సెప్ట్ మూవీగా అంతరిక్షం సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. క్రిష్, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన అదితి రావు, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఇండియన్ స్పేస్ సెంటర్ నుండి మిహిర అనే శాటిలైట్ కు స్పేస్ లోకి పంపిస్తారు. అయితే అది ట్రాక్ తప్పడం వల్ల ప్రపంచ కమ్యునికేషన్ వ్యవస్థను నాశనం చేస్తుందని తెలుసుకుంటారు. అయితే ఈ సమస్య నుండి బయట పడేలా ప్రయత్నించి ఇదవరకు అక్కడ పనిచేసిన దేవ్ (వరుణ్ తేజ్)ను వెనక్కి పిలుస్తారు. రియా (అదితి రావు) వల్ల దేవ్ మళ్లీ స్పేస్ సెంటర్ కు వస్తాడు. శాటిలైట్ మిహిర గురించి తెలుసుకుంటాడు. ఆ ప్రాబ్లెం ఫిక్స్ చేసేందుకు స్పేస్ లోకి తన టీం తో వెళ్తాడు. అయితే అనుకున్న టైంలో మిహిరని ఫిక్స్ చేస్తాడు దేవ్. కాని తన కలలు కన్న విప్రయాన్ శాటిలైట్ కనిపెట్టి దాన్ని బాగుచేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది.. దేవ్ అనుకున్నది చేయగలిగాడా..? విప్రయాన్ శాటిలైట్ వెనుక ఉన్న కారణాలు ఏంటి..? అది ఎందుకు మిస్ అయ్యింది అన్నది సినిమా కథ.
1
నటీనటుల ప్రతిభ :

వరుణ్ తేజ్ వ్యోమగామిగా అదరగొట్టాడు. ఒకరకమైన ఇమేజ్ లో ఇరుక్కుపోకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ ఇలాంటి స్పేస్ కాన్సెప్ట్ తో సినిమా చేయడం గొప్ప విషయం. ఈ సినిమాతో వరుణ్ తేజ్ మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. ఇక సినిమాలో లావణ్య త్రిపాఠి, అదిరి రావుల నటన మెప్పించింది. అవసరాల శ్రీనివాస్, రాజ, సత్యదేవ్ బాగా చేశారు. మిగతా పాత్రలన్ని మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు ఆయన కెమెరా వర్క్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తుంది. ప్రశాంత్ విహారి మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. రాజీవ్ రెడ్డి, క్రిష్ సినిమాకు ఎంత బడ్జెట్ కావాలో అంత పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సంకల్ప్ రెడ్డి మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చాటాడు. ఘాజి తర్వాత అతను అంతరిక్షం చేయడం మెచ్చుకోదగిన విషయం.
2
విశ్లేషణ :

తెలుగులో వచ్చిన మొదటి స్పేస్ సబ్జెక్ట్ కాబట్టి ఆడియెన్స్ లో ఆ క్యూరియాసిటీని పర్ఫెక్ట్ సినిమాగా సంకల్ప్ రెడ్డి అంతరిక్షం ను డీల్ చేశాడు. అయితే సినిమాలో అక్కడక్కడ సిజి వర్క్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కథ, కథనాల్లో దర్శకుడు మరోసారి తన సత్తా చాటాడు. ఘాజి అంటూ సముద్రపు లోతుల్లోకి ప్రేక్షకులను తీసుకెళ్లిన సంకల్ప్ రెడ్డి ఈసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లాడు.

ఆడియెన్స్ ప్రతి ఒక్కరికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించేలా అద్భుతమైన అవుట్ పుట్ తో వచ్చింది. అయితే అక్కడక్కడ కాస్త నరేషన్ స్లో అనిపించినా ఆల్రెడీ స్టోరీకి కనెక్ట్ అయిన ఆడియెన్స్ కు అదేం పెద్ద డిస్ట్రబ్ చేయదు. వరుణ్ తేజ్ లావణ్యల ట్రాక్ బాగుంటుంది. స్పేస్ లో వరుణ్ తేజ్ ప్రయోగాలు అదిరిపోతాయి. రెగ్యులర్ సిని లవర్స్ కు మాత్రమే కాదు కొత్తగా ఏదైనా సినిమా వస్తే ఎంకరేజ్ చేసే తెలుగు ఆడియెన్స్ కు ఈ అంతరిక్షం బాగా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్ :

డైరక్టర్

వరుణ్ తేజ్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో అవడం

సిజి వర్క్

బాటం లైన్ :

అంతరిక్షం.. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా..!

రేటింగ్ : 3.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news