రజినీకాంత్ ” పేట” ఆఫీషియల్ ట్రైలర్

సౌత్ లోనే కాదు ఇండియా మొత్తం మీద సూపర్ స్టార్ రజినికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉండదని చెప్పొచ్చు. వయసు మీద పడినా సరే తన స్టైల్ ఏమాత్రం తగ్గలేదు.. అది రజిని అంటే.. రీసెంట్ గా 2.ఓతో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన రజినికాంత్ కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో పెట్ట మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. పెట్ట టీజర్ లోనే రజిని స్టైల్ అదరగొట్టగా ఇప్పుడు ట్రైలర్ తో మరింత హంగామా చేస్తున్నాడు రజినికాంత్.

కార్తిక్ సుబ్బరాజు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరక్టర్ కు ఇంత త్వరగా రజినితో సినిమా చేసే ఛాన్స్ వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. సినిమాలో రజినికి జంటగా సిమ్రాన్, త్రిష నటిస్తున్నారు. అంతేకాదు కోలీవుడ్ క్రేజీ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా పెట్టలో విలన్ గా నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా రజిని ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఉందని చెప్పొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 10న పెట్ట రిలీజ్ అవుతుంది. అయితే సినిమా తెలుగు వర్షం గురించి ఇంకా క్లారిటీ రాలేదు. తెలుగులో పెట్టని సి.కళ్యాణ్ రిలీజ్ చేస్తున్నారని అన్నారు.

Leave a comment