షాకింగ్.. RRR నుండి చరణ్ అవుట్..!

ఎన్.టి.ఆర్, రాం చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టిజియస్ మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ మీద రకరకాల వార్తలు సంచలనంగా మారుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి రాం చరణ్ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అదేంటి రాజమౌళి ఇద్దరు క్రేజీ స్టార్స్ తో కలిపి మల్టీస్టారర్ ప్లాన్ చేశాక ఎలా చరణ్ సినిమా నుండి బయటకు వస్తాడు. ఒకవేల ఈగో క్లాషెస్ ఏమైనా వచ్చాయా.. సినిమాలో చరణ్ లేకుంటే ఎన్.టి.ఆర్ అయినా ఉంటాడా ఆర్.ఆర్.ఆర్ మధ్యలోనే ఆగుతుందా అన్న సందిగ్ధం ఏర్పడింది. అయితే ఇదంతా ఏంటి అనుకోవచ్చు.. జస్ట్ రాం చరణ్ ట్రిపుల్ ఆర్ కు చిన్న బ్రేక్ ఇచ్చేశాడంతే.
2
చరణ్ ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నాడు. శబరి వెళ్లి దర్శనం చేసుకోవాల్సి ఉంది. డిసెంబర్ 7న రాం చరణ్ శబరిమల యాత్ర మొదలు పెట్టనున్నాడట. డిసెంబర్ 9కి మళ్లీ రిటర్న్ అవుతాడని తెలుస్తుంది. ఇక తిరిగి వచ్చాక బోయపాటి శ్రీనుతో చేస్తున్న వినయ విధేయ రామ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు చరణ్. సినిమా కోసం ఓ పాట బ్యాలెన్స్ ఉందట. అది పూర్తి చేస్తే సినిమా కంప్లీట్ అవుతుందతా. అందుకే చరణ్ రాగానే ఆ పాటని ఫినిష్ చేస్తాడట. ఇక ఆ తర్వాత మళ్లీ రాజమౌళి సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడట.
1
ట్రిపుల్ ఆర్ ఓ పిరియాడికల్ మూవీగా రాబోతుందని అంటున్నారు. సినిమాలో రాం చరణ్ పోలీస్ గా నటిస్తుండగా ఎన్.టి.ఆర్ బందిపోటు దొంగగా కనిపిస్తాడని తెలుస్తుంది. డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాకు రామ రావణ రాజ్యం అన్న టైటిల్ పరిశీలణలో ఉందట. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై కూడా తారాస్థాయిలో అంచనాలున్నాయి. సినిమాలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్ ఎంపికవగా మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. సినిమాకు సంబందించిన ఓ సర్ ప్రైజ్ అప్డేట్ ఈ నెల 12న రివీల్ చేస్తాడట రాజమౌళి.

Leave a comment