హాస్పిటల్ పాలైన స్టార్ హీరోయిన్.. పరిస్థితి విషమం..?

తెలుగులో చిన్న చిన్న పాత్రలతో అలరించిన దీక్షా పంత్ బిగ్ బాస్ సీజన్ 1లో తన గ్లామర్ తో అలరించింది. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1లో దీక్షా పంత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. ఇక ప్రిన్స్ తో రొమాన్స్ బిగ్ బాస్ సీజన్ 1కు హైలెట్ గా నిలిచింది. ఈమధ్య వచ్చిన శ్రీకాంత్ ఆపరేషన్ 2019 సినిమాలో దీక్షా పంత్ హీరోయిన్ గా నటించింది. ఇదిలాఉంటే దీక్షా పంత్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న పిక్ తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది.

ఫుడ్ పాయిజిన్ వల్ల హాస్పిటల్ పాలయ్యిందట దీక్షా పంత్. దీని వల్ల షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి అమ్మడు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుందో కాని ఫుడ్ పాయిజిన్ ఆమెను ఇలా చేసింది. సెలబ్రిటీస్ అంటే కామన్ గా పార్టీలు ఉంటాయి. అలాంటి పార్టీలో ఎలాంటి ఫుడ్ ఉంటుందో తెలిసిందే. అయితే అన్ని కలిపి కొట్టేస్తే మాత్రం ఇదిగో ఇలా దీక్షా పంత్ లా హాస్పిటల్ లో చేరాల్సి వస్తుంది. కొన్ని కాంబినేషన్స్ బాడీకి అసలు పడవు. అలాంటివి తీసుకోవడం వల్లే ఫుడ్ పాయిజిన్ అవుతుంది. దీక్షా పంత్ పిక్ షేర్ చేయగానే ఆమె త్వరగా కోలుకుని మళ్లీ ఎప్పటిలానే కావాలని ఆమె ఫాలోవర్స్, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Leave a comment