మరోసారి విరుచుకుపడ్డ RGV.. మరో వెన్నుపోటు సాంగ్ (వీడియో)..

ఎన్.టి.ఆర్ బయోపిక్ వర్సెస్ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఫైట్ గురించి తెలిసిందే. ఓ పక్క బాలకృష్ణ ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రను ఎంతో గొప్పగా ఆదర్శ ప్రాయంగా తెరకెక్కిస్తుంటే ఆర్జివి మాత్రం లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ ఎన్.టి.ఆర్ అసలు జీవిత కథ ఇదే అంటూ ప్రమోట్ చేస్తున్నాడు. అంతేకాదు ఆ సినిమా నుండి రిలీజ్ చేసిన వెన్నుపోటు సాంగ్ చూస్తే సినిమా ఎలా ఉండబోతుంది అన్నది అర్ధమవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా వస్తుందని తెలుస్తుంది.

అయితే వెన్నుపోటు సాంగ్ కు టిడిపి శ్రేణుల నుండి నిరసనలు వచ్చాయి. కార్యకర్తలు వర్మ మీద సీరియస్ అవుతున్నారు. ఇదిలాఉంటే వర్మ వెన్నుపోటు సాంగ్ కు రియల్ వీడియోస్ తో ఓ ఎన్.టి.ఆర్ ఫ్యాన్ వీడియో ప్రిపేర్ చేశాడు. దాన్ని షేర్ చేస్తూ ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్, రచయిత సిరాశ్రీలకు షేర్ చేశాడు. మీరు ఇది చూడండి వెన్నుపోటు సాంగ్ కు ఎన్.టి.ఆర్ ఫ్యాన్ చేసిన వీడియో ఇది అంటూ ఆర్జివి కామెంట్ పెట్టడం జరిగింది. చూస్తుంటే ఆర్జివి ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పెద్ద నష్టం కలిగించేలా ఉన్నాడు.

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో స్టార్స్ ఎవరన్నది కూడా రివీల్ చేయట్లేదు. సీక్రెట్ గా సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 24న రిలీజ్ చేయడం పక్కా అని వర్మ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ జనవరి 9న వస్తుంది. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మాత్రం జనవరి చివరన రిలీజ్ ఫిక్స్ చేశారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాపై ఈ విధంగా నానా రచ్చ జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు.

Leave a comment