కోరిక తీర్చమంటే…రూమ్ కి పిలిచి ఎం చేసిందో చూడండి..

లైంగిక వేధింపులకు పాల్పడేవారందరికీ ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తోంది. పెళ్ళయ్యి..ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళను పెళ్లి చేసుకుంటాను అంటూ… తన కోరిక తీర్చాలంటూ…వేధిస్తున్న ఓ ప్రబుద్దుడికి జీవితంలో కోలుకోలేని విధంగా బుద్దిచెప్పింది ఆ మహిళ. ఇంతకీ వీరిద్దరి వయస్సు ఏమైనా దగ్గర దగ్గరగా ఉందా అంటే … అదీ లేదు… అతడికి 27, ఆమెకి 47. అయినా వయస్సు బేధం మరిచి ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో కుటుంబంలో కలహాలు రేగాయి.

దీంతో విరక్తి చెందిన ఆ మహిళ ఆ యువకుడికి ఎలా అయినా… బుద్ది చెప్పాలని భావించింది. ఇంటికి పిలిచి పురుషాంగం కోసేసింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగింది. ముంబయిలోని డోంబివలికి చెందిన వివాహితకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. వారికి ఎదురింట్లో ఉండే ఉన్న తుషార్ పుజారే (27) అనే యువకుడు గృహరుణాలు ఇప్పించే సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ మహిళను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి తన కోరిక తీర్చమంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. కుటుంభంలో కూడా కలహాలు మొదలవ్వడంతో… దీని అంతటికి కారణమైన తుషార్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న మహిళ ఇద్దరు యువకులతో పథకం వేసింది.

తనకు ఇంటి రుణం కావాలని వివాహిత తుషార్‌కు చెప్పడంతో ఆమెను లొంగదీసుకునే ఛాన్స్ దొరికిందని ఆమె ఇంటికి ఉత్సాహంగా వెళ్లాడు. అప్పటికే ఇంట్లో ఉన్న ఇద్దరు యువకులతో కలిసి ఆమె తుషార్‌ను చితకబాదింది. ఆవేశం ఆపుకోలేక కత్తితో అతడి పురుషాంగాన్ని కోసి పారేసింది. బాధతో విలవిల్లాడుతున్న అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పురుషాంగంతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వివాహితతో పాటు ఆమెకు సహకరించిన తేజాస్ మహాత్రే(22), ప్రవీణ్ కెనియా (25) లను అదుపులోకి తీసుకున్నారు.

Leave a comment