కె.టి.ఆర్ కొత్త చదరంగం.. టీ.ఆర్.ఎస్ లోకి ఎన్టీఆర్.?

తెలంగాణా మంత్రి కె.టి.ఆర్ తో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్.టి.ఆర్, కె.టి.ఆర్ తో పాటుగా మరో ఇద్దరు ఆ పిక్ లో ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరన్నది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా జరిగిన తెలంగాణా ఎలక్షన్స్ లో టి.ఆర్.ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అందులో భాగంగా ఎన్.టి.ఆర్ కె.టి.ఆర్ కు కంగ్రాట్స్ చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు కొన్ని రాజకీయపరమైన విషయాలను షేర్ చేసుకున్నారట.
1
అసలైతే జరిగిన ఎలక్షన్స్ లో ఎన్.టి.ఆర్ అక్క హరికృష్ణ తనయ నందమూరి సుహాసిని కూడా పోటీ చేశారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్ధిగా సుహాసిని పోటీ చేయగా ఆమె కోసం ఎన్.టి.ఆర్ క్యాంపెయినింగ్ చేస్తారని అనుకున్నారు. కాని ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ఇద్దరు అందుకు నిరాకరించారు. చంద్రబాబు, బాలకృష్ణ మాత్రమే వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ కె.టి.ఆర్ మీటింగ్ కొత్త రాజకీయ సమీకరణాలకు తావిస్తుంది.

ఇప్పటికే బాలకృష్ణ ఎన్.టి.ఆర్ పైకి మాట్లాడుతున్నట్టు కనిపించినా ఇద్దరి మధ్య దూరం అలానే ఉందని చెబుతున్నారు. ఇక ఎన్.టి.ఆర్ కనీసం ఏపి ఎలక్షన్ టైం లో అయినా ప్రచారం చేస్తాడా అన్న డౌట్ మొదలైంది. ఇప్పుడప్పుడే పార్టీ ప్రచారం వద్దనుకుంటున్న ఎన్.టి.ఆర్ కొన్నాళ్లు కేవలం సినిమాలనే చేస్తా అని సన్నిహితులతో అంటున్నాడట. మరి అలా చేస్తే ఏపిలో కూడా ఈసారి టిడిపికి కష్టమే అని అంటున్నారు. మరి మారనున్న రాజకీయ సమీకరణాలు ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తాయో చూడాలి.