‘కాలా’ రికార్డ్స్ ని టచ్ చేయలేకపోయినా రజని 2.0

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించి 2 .0 మీద మొదటి నుంచి భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే గతంలో వచ్చిన రోబో మంచి హిట్ టాక్ తెచ్చుకోవడం తో పాటు ప్రపంచవ్యాప్తంగా … సంచలనం సృష్టించి హాలీవుడ్ సినిమాల పక్కన నిలబడింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో … రోబో కి సీక్వెల్ గా వచ్చిన 2 .0 కూడా అదే స్థాయిలో టాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్ల సునామి సృష్టిస్తుందని భావించారు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. అంటే… కలెక్షన్ల పరంగా చాలా వీక్ గా కనిపించింది.

ఈ సినిమా ఏకంగా బాహుబలి 2 రికార్డులను బద్దలు కొడుతుంది అని అందరూ అంచనా వేశారు. కానీ ఈ సినిమా ఆ రేంజ్ అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు అంతా లోపాలను వెతికేపనిలో పడ్డారు. ఈ సినిమా ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడానికి రజినీయేనా అని కూడా తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు తీసిన ”కబాలి” మరియు ”కాలా” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి.
అందులోను కబాలి పరిస్థితి అయితే మరీ దారుణం 2.0 చిత్రానికి కూడా రానంత క్రేజ్ కేవలం రజిని వల్లనే వచ్చింది. కానీ ఆ చిత్రమే ఇప్పుడు ఈ సినిమాకి కూడా పెద్ద తలనొప్పిగా మారింది.

రజిని క్రేజ్ పడిపోవడంతో ఆ ఎఫెక్ట్ ఈ చిత్రం మీద గట్టిగానే పడింది.ఎంతంటే ఓవర్సీస్ బాక్సాఫీస్ లో 2.0 చిత్రాన్ని మూడు భాషల్లో విడుదల చేసినా సరే కాలా కంటే తక్కువ వసూళ్లనే రాబట్టింది. అక్కడ 2.0 చిత్రానికి ప్రీమియర్ల కలెక్షన్ 5 లక్షల 38 వేల డాలర్లు రాబట్టగా కాలా చిత్రం దీనికన్నా ఎక్కువే రాబట్టిందంట. అయితే మొదటి రోజు తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఆ తరువాత భారీ వసూళ్లు రాబట్టిన సంగతి గుర్తు చేస్తున్నారు.

Leave a comment