ఎన్టీఆర్ బయోపిక్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..?

నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఎన్.టి.ఆర్. నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో వస్తున్న ఈ సినిమా రెండున్నర గంటల్లో చెప్పడం కుదరదని రెండు పార్టులు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ సినిమా మొదటి పార్ట్ కథానాయకుడు కాగా రెండో పార్ట్ మహానాయకుడుగా వస్తుంది. కథానాయకుడు సినిమా జనవరి 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. అంటే సినిమా రిలీజ్ కు సరిగా 9 రోజులు మాత్రమే ఉంది. ఇక సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవగా సినిమా సెన్సార్ శనివారం చేసుకుంటుందని అన్నారు.

అయితే ఆరోజు అనివార్య కారణాల వల్ల సెన్సార్ అవలేదట. సెన్సార్ సభ్యులు అందరు అందుబాటులో లేకపోవడం వల్ల సెన్సార్ పూర్తి కాలేదని అంటున్నారు. మరికొందరేమో సెన్సార్ కోసం ముహుర్తం చూశారని జనవరి 3న సెన్సార్ పూర్తవుతుందని అన్నారు. మరికొందరు మాత్రం సినిమా సెన్సార్ పూర్తయిందని యు సర్టిఫికెట్ తో ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా ఉందని అన్నారు. మరి ఎన్.టి.ఆర్ బయోపిక్ సెన్సార్ పై వచ్చిన ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం ఉందన్నది క్లారిటీ రావాలి.

ఇక కథానాయకుడు సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ వేసిన పాత్రలన్నిటిని బాలకృష్ణ వేయడం జరిగింది. సినిమాలో దాదాపు 60 గెటప్పులలో బాలకృష్ణ కనిపిస్తారు. సినిమాలో బాలకృష్ణ మాత్రమే మొత్తం స్క్రీన్ స్పేస్ ఆక్రమించారని చెప్పుకోవచ్చు. ఇక మహానాయకుడు సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ ఫిక్స్ చేశారు. రెండో పార్ట్ మొత్తం రాజకీయాలతో నిండి ఉంటుందట.

Leave a comment