అభిమానులకి భారీ షాక్ .. ఎన్టీఆర్ పై భారీ ఆంక్షలు..

రాజమౌళి తెరకెక్కించే ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్నరన్న విషయం తెలిసిందే. మెగా నందమూరి మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా వస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ మాత్రం అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే జిం వర్క్ అవుట్స్ చేస్తున్న ఎన్.టి.ఆర్ పర్ఫెక్ట్ ఫిట్ నెస్ కోసం ట్రై చేస్తున్నాడట.

అయితే ఈమధ్య తెలంగాణా ఎలక్షన్స్ టైంలో ఎన్.టి.ఆర్ కనిపించిన తీరు ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. తారక్ ఎప్పటిలానే లావెక్కాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ కోసం లాయిడ్ స్టీవెన్స్ ఆద్వర్యంలో తారక్ జిం వర్క్ అవుట్ చేస్తున్నాడట. రెండు నెలలు బాగా కష్టపడాల్సి ఉంటుందట. అయితే జిం ట్రైలర్ నుండి అక్కడ పనిచేసే సిబ్బందికి ఎన్.టి.ఆర్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడేలా ఆంక్షలు విధించాడట. అది చాలా సీక్రెట్ గా ఉంచాలని చూస్తున్నాడట రాజమౌళి.

ఎన్.టి.ఆర్ ను ఓ రెండు నెలలు కనిపించకుండా చేసేలా రాజమౌళి ప్లాన్ చేశాడు. ఇక రాం చరణ్ లుక్ మాత్రం పెద్దగా తేడా ఉండదట. సినిమా లీకుల విషయంలో రాజమౌళి స్పెషల్ ఫోకస్ పెట్టాడట. సినిమాకు సంబందించి ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకకుండా ఉండేలా చూస్తున్నాడట. చిత్రయూనిట్ అందరికి జక్కన్న క్లాష్ పీకాడని తెలుస్తుంది.

Leave a comment