ఆమె కోసం ఛలో అంటున్న రాజమౌళి.. డైలమాలో పడ్డ తారక్-చరణ్..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR మూవీ ఇటీవల గ్రాండ్ లాంఛ్ జరుపుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ రికార్డులకు మరోసారి ఎసరు పెట్టాడు ఈ డైరెక్టర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్న రాజమౌళి కనీవిని ఎరుగని రీతిలో బ్లాక్‌బస్టర్ ఇవ్వనున్నాడు. అయితే ఈ సినిమా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న జక్కన్న, హీరోయిన్ల విషయంలోనూ అదే తరహాలో ప్రవర్తిస్తున్నాడు.
2
ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ఒక ఫారిన్ పాపతో పాటు ఇద్దరు ఇండియన్ ముద్దుగుమ్మలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్ రష్మికా మంధన ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఛలో, గీతా గోవిందం సినిమాలతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ పర్ఫార్మెన్స్‌కు ఇంప్రెస్ అయ్యాడట రాజమౌళి. అందుకే తాను తీసే మల్టీస్టారర్ చిత్రంలో ఒక హీరోయిన్‌గా రష్మికాను తీసుకోవాలని అనుకుంటున్నాడట జక్కన్న.
1
కాగా ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈమెను ఎవరి పక్కన హీరోయిన్‌గా పెడతారా అనే డౌట్ అప్పుడే సినీ జనాల్లో మొదలయ్యింది. తారక్ పక్కన ఈ బ్యూటీ బాగుంటుందా లేక చరణ్ పక్కన బాగుంటుందా అని వారు ఆలోచిస్తు్న్నారు. ఏదేమైనా రష్మికాకు మాత్రం ఈ ఆఫర్ వస్తే అదిరిపోయే హిట్టు బొమ్మ ఆమె కెరీర్‌లో పడుతుంది.

Leave a comment