చెర్రీ ఫ్యాన్స్ కోసం తారక్‌ను బలి చేస్తున్న రాజమౌళి..

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR చిత్రం గురించి అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు ఇండస్ట్రీలో ఎలాంటి హల్‌చల్ వినిపించిందో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఒక రేంజీ అంచనాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఏర్పడ్డాయి. కాగా బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఆలిండియా చూపు మొత్తం ఈ సినిమాపై పడింది.

కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోలు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం ఇందులో చరణ్ అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో స్టన్ చేస్తుంటే తారక్ మాత్రం మళ్లీ లావుగా కనిపిస్తాడట. అరవింద సమేత కోసం చాలా హార్డ్ వర్కవుట్లు చేసి సిక్స్ ప్యాక్ తెచ్చుకున్న తారక్ ఇప్పుడు ఈ సినిమాలో మరోసారి లావుగా మారాడాట. చరణ్ పాత్ర కోసమే తారక్‌ను అలా లావుగా మారాల్సిందిగా జక్కన్న చెప్పినట్లు చిత్ర యూనిట్ అంటోంది.

ఏదేమైనా చరణ్‌ను అల్ట్రా స్టైలిష్ లుక్‌లో చూపిస్తూ తమ యంగ్ టైగర్‌ను లావుగా చూపించడం సబబు కాదని వాదిస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మొత్తానికి RRR చిత్రం అటు సంచలనాలకు మాత్రమే కాకుండా విమర్శలకు కూడా కేరాఫ్ అడ్రెస్ కానుంది అని సినీ క్రిటిక్స్ అంటున్నారు. ఇంకా హీరోయిన్ ఫిక్స్ చేయని ఈ సినిమాలో కీర్తి సురేష్, రష్మికా మందనా, పూజా హెగ్డేలో ఎవరైనా నటించే అవకాశం ఉందని అంటున్నారు చిత్ర యూనిట్.

Leave a comment