Gossipsట్రిపుల్ ఆర్ కథపై అక్కసు చూపిస్తున్న జాతీయ మీడియా..

ట్రిపుల్ ఆర్ కథపై అక్కసు చూపిస్తున్న జాతీయ మీడియా..

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా తెలుగు సినిమా రేంజ్ ఏంటో చూపించిన రాజమౌళి తన తర్వాత సినిమాగా చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ అంటూ ఆ సినిమా ఎనౌన్స్ చేసిన నాటి నుండి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. త్వరలో మొదలవనున్న ఈ సినిమా కథపై రోజుకో వార్త వస్తుంది. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ సినిమా కథపై జాతీయ మీడియా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

ట్రిపుల్ ఆర్ కథ ఇదే అంటూ ఓ కట్టుకథని వినిపిస్తుంది. సినిమా ఓ పిరియాడికల్ మూవీ అని.. 1920లో స్వాతంత్ర ఉద్యమం గురించి ఉంటుందని. సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ లుక్స్ బాగా ఉంటాయని చెప్పుకొచ్చింది జాతీయ మీడియా. రాజమౌళి ఈసారి దేశభక్తిని సంబందించిన కథతో వస్తున్నాడని. విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథ అందించాడని అంటున్నారు.

నవంబర్ 5న సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కథ ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే ఈ మల్టీస్టారర్ ను మరో బాహుబలి చేయాలని పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నాడు రాజమౌళి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ మిగతా స్టార్ కాస్ట్ కు సంబందించిన విషయాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news