” సవ్యసాచి ” ఫస్ట్ డే కలెక్షన్స్..ఎడం చేతివాటం దెబ్బ..

చందు మొండేటి దర్శకత్వంలో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సవ్యసాచి సినిమా సానుకూల ఫలితాలను రాబట్టుకుంది. ఈ చిత్రం ఓవర్సీస్ లో ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన రాబట్టింది. ఈ సినిమా ముఖ్యంగా నాగచైతన్యకు మంచి హిట్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమా విజయంతో చిత్ర యూనిట్ కూడా సంతోషంగా కనిపిస్తుంది. సవ్యసాచి హైప్ క్రియేట్ చేయడంతో ఆ చిత్ర హక్కుల కోసం భారీ గిరాకీ పెరిగింది. ప్రముఖ పంపిణీ సంస్థలు పోటీ పడుతున్నాయి. నాగ చైతన్య అంతకుముందు సినిమా ప్రేమం, రారండోయ్ వేడుక చూద్దాం రికార్డులను సవ్యసాచి బద్దలు కొట్టింది.

అమెరికాలో ప్రీమియర్ షోలలో 74,219 డాలర్లు వసూలు చేసింది ట్రేడ్ వర్గాల నివేదిక ప్రకారం నాగచైతన్య నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ అమెరికా ప్రీమియర్ షోల నుండి 87 ధియేటర్ల నుండి 74, 667 డాలర్లు వసూలు చేసింది. ఈ విధంగా సవ్యసాచి ప్రేమమ్ , రారండోయ్ వేడుక చూద్దాం రికార్డులను సవ్యసాచి బద్దలు కొట్టింది. ట్రేడ్ విశ్లేషకుడు జీవి ట్విట్టర్ లో సవ్యసాచి చిత్రం గురించిన ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు.

సవ్యసాచి అమెరికాలో ఉదయం ఆట 11 .45 షోలో 74 థియేటర్లు 26, 751 డాలర్లు వసూలు చేసిందట. ఏపీ తెలంగాణ నుంచి 17.5 కోట్లు ఇండియాలో ఇతర ప్రాంతాల్లో 0.90 కోట్లు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు ద్వారా 22 కోట్లు వసూల్ చేసింది. కానీ శైలజ రెడ్డి అల్లుడు 24 కోట్లు రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది.

వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ లక్షణాలను, దాని వలన తలెత్తే సమస్యలు నేపథ్యంలో ఈ సినిమా ప్రెకషకులను ఆకట్టుకుంటోంది. అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమికా చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు.

Leave a comment