తాత కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి తాత కాబోతున్నాడు. ఈ టైటిల్ చూడగానే చిరు ఇంట మెగా వారసుడు వస్తున్నాడని అనుకోవడం ఖాయం. కాని ఈ వార్త వారసుడి గురించి కాదు. చిరంజీవి రెండో కూతురు శ్రీజ తల్లి కాబోతుందట. ఈ విషయాన్ని శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ స్వయంగా ప్రకటించారు. రెండేళ్ల క్రిందట శ్రీజని పెళ్లాడాడు కళ్యాణ్ దేవ్. బిజినెస్ మెన్ అయిన కళ్యాణ్ దేవ్ శ్రీజకు చిన్ననాటి స్నేహితుడు కూడా.

దీవాళికి తన భార్య తల్లి కాబోతున్న విషయాన్ని మెగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు కళ్యాణ్ దేవ్. ఈమధ్య ఇంతను కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విజేత సినిమాతో కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పుడు కళ్యాణ్ మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. విజేతలో పర్వాలేదు అనిపించిన కళ్యాణ్ తన సెకండ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు.

Leave a comment