దుమ్ములేపుతున్న ” కవచం ” ఆఫీషియల్ టీజర్

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం తర్వాత చేస్తున్న సినిమా కవచం. శ్రీనివాస్ మామిళ్ల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నవీన్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ బాబుతో కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేస్తుంది.

సినిమాలో మరో హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ కూడా నటిస్తుండటం విశేషం. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఈరోజు రిలీజైంది. టీజర్ చూస్తే ఇదో రొటీన్ కమర్షియల్ పోలీస్ స్టోరీగా అనిపిస్తుంది. మరి స్క్రీన్ ప్లే ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా చేస్తే తప్ప ఈ సినిమా గట్టేక్కేలా లేదు.

శ్రీనివాస్ మామిళ్ల కథ టీజర్ లోనే తెలుస్తుంది. మరి ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a comment