షాక్ ఇస్తున్న ‘2.0’ తెలుగు శాటిలైట్ రైట్స్..

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా శంకర్ డైరక్షన్ లో ప్రెస్టిజియస్ గా తెరకెక్కుతున్న సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. 550 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు.
2
ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమా తెలుగు రైట్స్ ఎస్వీఆర్ మీడియా 80 కోట్ల రూపాయలకు కొన్నారట. ఈమధ్య తమిళ సినిమాలకు తెలుగులో అంత మార్కెట్ ఏర్పడలేదు. రజిని నటించిన కబాలి, కాలా ఇక్కడ నిరాశ పరచాయి. అయితే 2.ఓ మాత్రం కచ్చితంగా అంచనాలను అందుకుంటుందని భారీ రేటుకి కొనేశారు.
1
నవంబర్ 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. విజువల్ వండర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఓ అద్భుతాన్ని చూడబోతున్నారంటూ చిత్రయూనిట్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది.

Leave a comment